శ్రీ శ్రీ శ్రీ మహా శక్తి పీఠం

DIVINE CONSULTATION & REGISTRATION PORTAL
శ్రీ శ్రీ శ్రీ
మహా శక్తి పీఠం

Welcome to the Sri Sri Sri Mahasakthi Peetham consultation and registration portal. Register for consultation, track your application status and stay connected with the divine centre.

రండి మీ జీవితాన్ని ఉన్నత మార్గంలోకి నడిపించడానికి ఒక నిర్దిష్టమైన మార్గం కావాలి. గాలికి దీపం పెట్టి నీదే భారం అంటే దీపం నిలుస్తుందా? సునాయాసంగా సాగవలసిన జీవితం దుర్భరంగా మారిందా? కారణం తెలుసుకుందాం. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారా? తెలుసుకుందాం ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదో. వ్యాపారం చేయాలనుందా? తెలుసుకుందాం ఏ వ్యాపారం చేయాలో, ఏ వ్యాపారం చేయకూడదో. గృహ నిర్మాణం చేసుకునే ఆలోచన ఉందా? తెలుసుకుందాం ఏ దిక్కున సింహద్వారం ఉండకూడదో. ఉద్యోగం రావడం లేదా? తెలుసుకుందాం ఆటంకం ఏమిటో. వ్యాపారం లాభదాయకంగా లేదా? తెలుసుకుందాం ఏ గ్రహం మీకు అడ్డుపడుతుందో. సంతానం కోసం పరితపిస్తున్నారా? తెలుసుకుందాం కర్మ ఫలం ఎలా ఉందో. మీ జీవితంలో అయోమయం, గందరగోళం నెలకొన్నాయా? తెలుసుకుందాం ఏ దుష్టశక్తి ప్రభావమో. అలానే ఎలా పడితే అలా జీవిస్తే జీవితం ఉద్ధరణకు నోచుకుంటుందా? ప్రతి మనిషి కారణ జన్ముడే. ఆ కారణం తెలుసుకుందాం. మన గమ్యం తెలుసుకుని సునాయాసంగా జీవితంలో విజయం సాధించాలంటే మనకు పొంచి ఉన్న ప్రమాదం ముందే తెలుసుకుందాం. పంచభూతాలు మనకు సహకరించాలి. ప్రకృతి మనకు సహకరించాలి. విశ్వం మనకు సహకరించాలి. నవగ్రహాలు నిన్ను ఆశీర్వదించాలి. ఆ పరమాత్మ నిన్ను అక్కున చేర్చుకోవాలి. అంటే మనం ఏమి చేయాలి తెలుసుకుందాం.

నీ గురించి మాత్రం తెలుసుకుంటే చాలు, నీ ప్రయాణం సులభం చేసుకోగలవు... అనుమానంతో కాదు — విశ్వాసంతో ముందుకు సాగాలి.
సంప్రదించండి